
బాహుబలి భళ్లాలదేవగా సూపర్ పాపులారిటీ సంపాదించిన రానా దగ్గుబాటి తెలుగుతో పాటు హిందిలో కూడా సినిమాలు చేస్తూ నేషనల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో స్టార్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న రానా పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా సూపర్ టాలెంట్ చూపిన తరుణ్ భాస్కర్ తో సినిమాకు సిద్ధమయ్యాడట.
పెళ్లిచూపులు తర్వాత ఈనగరానికి ఏమైంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణ్ భాస్కర్ రానాతో సినిమాకు అదిరిపోయే కథ రాసుకున్నాడట. మొదటి సినిమా సమర్పకుడిగా ఉన్న సురేష్ బాబు తరుణ్ లోని టాలెంట్ చూసి రెండో సినిమాకు నిర్మాతగా మారాడు. ఇక రానాతో చేయాలనుకుంటున్న సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్ లోనే తెరక్కనుందని తెలుస్తుంది. మరి తరుణ్ భాస్కర్ లాంటి టాలెంటెడ్ డైరక్టర్ తో రానా మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.