
సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను హిట్ తర్వాత మరింత జోష్ పెంచుకున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తన 25వ సినిమా షూటింగ్ లో ఉన్నాడు మహేష్. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే.
అంతేకాదు ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాలో క్రేజీ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట. కొన్నాళ్లు స్టార్ సినిమాల్లో కచ్చితంగా ఉంటూ వచ్చే ఐటం సాంగ్స్ ఈమధ్య తగ్గుముఖం పట్టాయి. అయితే సందర్భం ఉంది కాబట్టి మహేష్ సినిమాలో క్రేజీ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ తో చర్చలు జరుపుతున్నారట. అంతేకాదు ఈ సాంగ్ లో మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కనిపిస్తారని టాక్. మొత్తానికి మహేష్ 25వ సినిమా సూపర్ సర్ ప్రైజెస్ ఇస్తుందని తెలుస్తుంది.