
మెగా ఫ్యామిలీ నుండి కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. మెగాస్టార్ చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ విజేతగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాకేష్ శషి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. బాహుబలి లాంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సెంథిల్ కుమార్ ఈ సినిమాకు కెమెరా మెన్ గా వర్క్ చేశారు. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే మరో సినిమాకు లైన్ చేశాడు కళ్యాణ్ దేవ్.
మెగా హీరోలతో సూపర్ హిట్ కొట్టిన క్రేజీ డైరక్టర్ హరీష్ శంకర్ డైరక్షన్ లో కళ్యాణ్ దేవ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. పవన్ తో గబ్బర్ సింగ్, సాయి ధరం తేజ్ తో సుబ్రమణ్యం ఫర్ సేల్, బన్నితో దువ్వాడ జగన్నాథం సినిమా తీసి హిట్ కొట్టిన హరీష్ శంకర్ ఈసారి కళ్యాణ్ దేవ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ అయ్యాయని టాక్. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందట.