విజయవాడ థియేటర్ లో రంగస్థలం రికార్డ్..!

సుకుమార్ డైరక్షన్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా వచ్చిన సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. మార్చి 30న రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఏరియాల వైజ్ గా రికార్డులను సృష్టించిన ఈ సినిమా విజయవాడ అప్సర థియేటర్ లో సరికొత్త సంచలనాలు సృష్టించింది.

సినిమా 66వ రోజు కూడా 1 లక్ష గ్రాస్ కలెక్ట్ చేసింది.. 55 వేల రూపాయల్ షేర్ కలెక్ట్ చేసిందట. కేవలం ఈ ఒక్క థియేటర్ లోనే కోటి 5 లక్షల 63వేల రూపాయలు కలెక్ట్ చేసింది రంగస్థలం. 61.22 లక్షల షేర్ వచ్చిందన్నమాట. మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న ఈ ఏరియాలో మెగాస్టార్ ఇంద్ర, పవర్ స్టార్ ఖుషి సినిమాలు కూడా కోటి రూపాయల్ గ్రాస్ కలెక్ట్ చేశాయని తెలుస్తుంది. మొత్తానికి విజయవాడలో రంగథలంతో రాం చరణ్ ఇంకా తన స్టామినా చూపిస్తున్నాడు.