మరో నిర్మాత కొడుకు హీరోగా ఎంట్రీ..!

హీరో కావాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు లక్ కూడా కలిసి రావాలి. ఇక సాధారణ మనిషి హీరో కావాలంటే కచ్చితంగా దానికో లెక్క ఉండాలి. అలా కాకుండా హీరో కొడుకో, నిర్మాత కొడుకో అయ్యుంటే అది వేరుగా ఉంటుంది. వారికి డైరెక్ట్ గా ఆఫర్లు వచ్చేస్తాయి. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలోకి మరో నిర్మాత తనయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆయన ఎవరో కాదు డివివి దానయ్య తనయుడని అంటున్నారు. 

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఇషక్ జాదే సినిమా రీమేక్ గా దానయ్య తనయుడి డెబ్యూ మూవీ ఉంటుందట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటించాడు. ఇప్పటికే నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తుంటే దానయ్య కొడుకు కూడా హీరోగా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సినిమాలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ కాజల్ ను సెలెక్ట్ చేశారట. తేజ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని అంటున్నారు.