
బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా నిర్మించబడుతుంది.
ఇక ఈ సినిమా తర్వాత జిల్ రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఆ సినిమా కథ చంద్రశేఖర్ ఏలేటి సిద్ధం చేశాడట. ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో ఏలేటి ఆ లైన్ రాసుకోగా ఆ లైన్ ను జిల్ రాధాకృష్ణ డెవలప్ చేశాడట. సినిమాలో హీరో ఆస్ట్రాలజర్ గా కనిపిస్తాడట. జరిగేది ముందే చెప్పే పాత్రలో ప్రభాస్ జతకాలు చెప్పేస్తాడట. మరి హాలీవుడ్ కథ స్పూర్తితో రాబోతున్న ప్రభాస్ మూవీ రాధాకృష్ణ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో చూడాలి.