'పంతం' నెగ్గేలా ఉన్నాడు.. ట్రైలర్ బాగుంది కాని..!

గోపిచంద్ హీరోగా నూతన దర్శకుడు చక్రవర్తి డైరక్షన్ లో వస్తున్న సినిమా పంతం. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహెరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. గోపిసుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ పంతం ట్రైలర్ తో అలరించిందని చెప్పొచ్చు.

ముఖ్యంగా సినిమాలో గోపిచంద్ డైలాగ్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈసారి గోపిచంద్ ఎలాగైనా తన పంతం నెగ్గించుకునేలా ఉన్నాడని అంటున్నారు. రాజకీయ నేతలమీద కొన్ని డైలాగ్స్.. కోర్ట్ సీన్ లో గోపిచంద్ ఎమోషనల్ స్పీచ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. అయితే ట్రైలర్ థీం మొత్తం చూస్తే రొటీన్ స్టోరీనే దానికి మంచి కమర్షియల్ స్క్రీన్ ప్లే అందించారని తెలుస్తుంది. గౌతం నంద, ఆక్సీజన్ సినిమాల తర్వాత గోపిచంద్ ఈ పంతం ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్నది చూడాలి.