
సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం డెహ్రాడూన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. గడ్డం లుక్ లో మహేష్ సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఇక సినిమాకు సంబందించి క్లాస్ రూం పిక్, మహేష్ షూటింగ్ లో నడుచుకుంటూ వస్తున్న ఫోటోలు లీక్ అయ్యాయి.
పూజ హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మహేష్ మేకోవర్ తో క్రేజీగా రాబోతున్న ఈ సినిమా 2019 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. లీకైన పిక్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ కథతో రాబోతుందని తెలుస్తుంది.