
విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా గీతా గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను వెరైటీగా మొదలుపెట్టారు. ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చిందటగా కంగ్రాట్స్ అని రష్మిక ట్విట్టర్ లో పెట్టింది. దానికి సమాధానం ఇస్తూ అవార్డుదేముంది లేండి.. మీలాంటి వాళ్ల ప్రేమని పొందితే చాలు అని ట్వీట్ చేశాడు.
దానికి బదులుగా ఇగో గోవింద ఈ ఓవరాక్షన్ తగ్గింది.. ఏ ప్రభాస్ కో, తారక్ కో అవార్డ్ ఇస్తే ఈ గొడవ వదిలిపోయేది అంటూ ట్వీట్ చేసింది. గీతా, గోవిందం అంటూ ఫస్ట్ లుక్ రివీల్ చేయడమే కాకుండా ఇలా ట్వీట్స్ తో సినిమాపై క్రేజ్ పెంచుతున్నారు. అర్జున్ రెడ్డితో యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ త్వరలో టాక్సీవాలాగా వస్తున్నాడు. ఆ తర్వాత గీతా గోవిందం రిలీజ్ ప్లాన్ చేస్తారు.