చికాగో సెక్స్ రాకెట్.. ఆడియో టేపులు లీక్..!

తీగ లాగితే డొంకంతా కదిలిన చికాగో సెక్స్ రాకెట్ టాలీవుడ్ పరువుని తీసేస్తుంది. ఈవెంట్స్ పేరుతో జల్సాలు చేస్తున్న కొందరు హీరోయిన్స్ పై పోలీసులు టార్గెట్ చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెళ్లడయ్యేలా చేసింది. ఇప్పటికే సెక్స్ రాకెట్ నడుపుతున్న కిషన్ దంపతులను అరెస్ట్ చేసి విచారిస్తుండగా విక్టిమ్స్ గా ఐదుగురు హీరోయిన్స్ పేర్లను పేర్కొన్నారు.   

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సెక్స్ రాకెట్ కు సంబందించిన ఓ ఆడియో టేప్ సంచలనం సృష్టిస్తుంది. కిషన్ వాయిస్ తో ఉన్న ఈ ఆడియో టేప్ లో అవతల వ్యక్తి వాయిస్ మాత్రం బయటపడలేదు. అక్కడకు వస్తున్న హీరోయిన్స్ ను డబ్బు ఆశ చూపి ఇలాంటి కార్యకలాపాలు చేసేలా ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది. చూస్తుంటే ఈ ఇష్యూ మీద పోలీసులు యాక్షన్ సీరియస్ గానే ఉంటుందని తెలుస్తుంది.