పోలీస్ స్టేషన్ లో సమంత..!

టైటిల్ చూడగానే కచ్చితంగా ఇదేదో యూఎస్ సెక్స్ రాకెట్ కు సంబందించిన విషయమే అనుకునే ఛాన్స్ ఉంది. కాని ఇక్కడ మ్యాటర్ అది కాదులేండి. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా సమంత స్టార్స్ అందరితో నటించేసింది. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కూడా అమ్మడు సినిమాలను చేస్తుంది. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాత కూడా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది సమంత.

ప్రస్తుతం కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ సినిమాలో నటిస్తున్న సమంత. మాత్రుక దర్శకుడు పవన్ కుమార్ తెలుగులో కూడా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్ పాత్ర చేస్తుంది. దీనికి సంబందించి పోలీస్ స్టేషన్ లో సీన్స్ షూట్ చేస్తున్నారు. ఓ కేసు విషయమై పోలీసులు ఆమెని విచారించే సన్నివేశాలు షూట్ చేస్తున్నారట. ఈ సినిమా తర్వాత నిన్నుకోరి దర్శకుడు శివ నిర్వాణ డైరక్షన్ లో చైతు హీరోగా ఓ సినిమాలో నటిస్తుంది సమంత.