చైతు కెరియర్ లో క్రేజీ రోల్..!

లవర్ బోయ్ నాగ చైతన్య కెరియర్ ను గాడిలో పెట్టుకునే క్రమంలో కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి డైరక్షన్ లో సవ్యసాచి సినిమా చేస్తున్న నాగ చైతన్య. ఈ సినిమాతో పాటుగా మారుతి తో శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక త్వరలోనే నిన్నుకోరి డైరక్టర్ శివ నిర్వాణ డైరక్షన్ లో సినిమా చేయబోతున్నాడట. 

ఈ సినిమాలో చైతు క్రికెటర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. నాని నిన్నుకోరితో ప్రతిభ చాటుకున్న శివ నిర్వాణ ఈ సినిమాను ప్రేమకథగా తెరకెక్కిస్తున్నాడట. సినిమాలో హీరోయిన్ గా చైతు రియల్ లైఫ్ పార్ట్ నర్ సమంత నటిస్తుందని తెలుస్తుంది. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇదే. చైతు కెరియర్ లో క్రికెటర్ గా క్రేజీ రోల్ చేస్తున్న ఈ సినిమాతో ఆడియెన్స్ ను మెప్పిస్తాడో లేదో చూడాలి.