తరుణ్ భాస్కర్ భారీ డీల్..!

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న పెళ్లిచూపులు సినిమాతో తన సత్తా చాటాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఒక్క సినిమాతో టాలెంటెడ్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ రెండో సినిమాగా ఈనగరానికి ఏమైంది అంటూ వస్తున్నాడు. నలుగురు కుర్రాళ్ల కథగా వస్తున్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. తన టాలెంట్ ముందే కనిపెట్టిన సురేష్ బాబు ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలను అతనితో చేస్తున్నారు. 

సురేష్ బాబు లాంటి బడా నిర్మాత ఒకేసారి 3 సినిమాలు ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదంటారా చెప్పండి అందుకే తరుణ్ భాస్కర్ కూడా వరుసగా సురేష్ ప్రొడక్షన్ లోనే సినిమాలు చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నాడట. ఈ నగరానికి ఏమైంది తర్వాత మరో రెండు సినిమాలు కూడా తరుణ్ భాస్కర్ ఎస్పి ప్రొడక్షన్ లోనే ఉంటాయి. మరి తరుణ్ భాస్కర్ కు వచ్చిన ఈ లక్కీ ఛాన్స్ ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.