నానికి అంత స్టఫ్ లేదు..!

బిగ్ బాస్ హోస్ట్ గా నాని తన మార్క్ చూపిస్తుండగా ఈమధ్యనే మొదటి ఎలిమినేటర్ గా బయటకు వచ్చిన సంజనా నానికి బిగ్ బాస్ హోస్ట్ చేసేంత స్టఫ్ లేదని చెప్పడం అందరిని ఆశ్చర్యపరచింది. బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాడు. అయితే ఆ రేంజ్ అందుకోవడంలో వెనుకపడ్డా నాని కూడా తన స్టైల్ లో యాంకరింగ్ చేస్తున్నాడు. అయితే మొదటి వారం హంగామా చేసి హౌజ్ నుండి బయటకు వచ్చిన సంజనా ఏకంగా నాని హోస్టింగ్ మీదే సంచలన కామెంట్ చేసింది.

బిగ్ బాస్ నుండి అలా బయటకు రాగానే పలు మీడియా ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇందులో సంజనా ఎన్.టి.ఆర్ హోస్టింగ్ బాగుందని నాని యాంకరింగ్ ఆ రేంజ్ లేదని చెప్పింది. అంతేకాదు ఎన్.టి.ఆర్ ను ఐఫోన్ తో పోల్చుతూ నానిని కామెంట్ చేసింది. బిగ్ బాస్ నుండి బయటకు రావడం ఆలస్యం ఆమె ఆసక్తికరమైన కామెంట్లతో తనకు పాపులారిటీ వచ్చేలా చేసుకుంటుంది.