
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరోసారి తండ్రి అయ్యాడు. తారక్, లక్ష్మి ప్రణతిలకు రెండో సంతానంగా మళ్లీ మగబిడ్డ పుట్టాడు. ఎన్.టి.ఆర్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెళ్లడించారు. కుటుంబ మరింత పెద్దదవుతుంది.. ఇట్స్ బోయ్ అంటూ ట్వీట్ చేశారు తారక్. తారక్, లక్ష్మి ప్రణతిలకు ఇదవరకు అభయ్ రాం అనే తనయుడు ఉన్నాడు. ఇప్పుడు రెండవ సంతానంగా బాబు పుట్టాడు.
ఈ విషయం తెలిసిన నందమూరి ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు. తమ హీరో ఎన్.టి.ఆర్ కు విశెష్ చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ త్రివిక్రం డైరక్షన్ లో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.