
ఆఫీసర్ సినిమా దెబ్బేయడంతో కింగ్ నాగార్జున కెరియర్ లో మళ్లీ కన్ ఫ్యూజన్ ఏర్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో నానితో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న నాగ్ ఆ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడట. ఇక అదే కాకుండా మళయాలంలో మోహన్ లాల్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు పూర్తి కాగానే మళ్లీ సోగ్గాడు దర్శకుడితో కలిసి సినిమా చేస్తాడని అంటున్నారు.
సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో 50 కోట్ల మార్క్ అందుకున్న నాగార్జున ఆ సినిమాలో బాలరాజు పాత్రకు కొనసాగింపుగా మరో సినిమా చేయనున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. కథ విషయంలో కళ్యాణ్ కృష్ణ, నాగార్జునల మధ్య చర్చలు జరుగుతున్నాయట. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే కాని సెకండ్ హాఫ్ ఎటు తేలట్లేదట. ఇక ఇప్పుడు నాగార్జుననే స్వయంగా కళ్యాణ్ కృష్ణకు కబురు పంపి బాలారాజు కథపై దృష్టి పెట్టమని చెప్పారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.