నాకు నాన్నకు ప్రేమతో.. అన్నకు నా నువ్వే..!

కళ్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర డైరక్షన్ లో వస్తున్న సినిమా నా నువ్వే. ఈ గురువారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఈవెంట్ స్పెషల్ గా నిలిచింది. తాను నాన్నకు ప్రేమతో టైంలో ఎలాంటి కన్ ఫ్యూజన్ లో ఉన్నానో.. ఇప్పుడు అన్న అలా ఉన్నారని.. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ప్రయోగాలను ఆదరిస్తారని నా నువ్వే సినిమా కూడా మంచి ఫలితాన్ని అందుకుంటుందని అన్నారు ఎన్.టి.ఆర్.  

దర్శకుడు జయేంద్ర ఇదవరకు హీరో ఉన్న ఇమేజ్ కు పూర్తిగా విరుద్ధంగా సినిమా తీయడం గొప్ప విషయమని చెప్పొచ్చు. సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నిషియన్ కు సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వాలని ఆశించారు ఎన్.టి.ఆర్. వరుసగా ఒకే రకమైన సినిమాలు చేస్తే హీరోలకు, ఆడియెన్స్ కు బోర్ కొడుతుందని కళ్యాణ్ అన్న ఈ సినిమా తనకు తప్పకుండా పెద్ద హిట్ ఇస్తుందని అన్నారు.