బిగ్ బాస్-2.. నాని మొదలుపెట్టేశాడు..!

స్టార్ మా క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 మొదలైంది. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసిన ఆ షో సూపర్ సక్సెస్ అవగా ఈ సెకండ్ సీజన్ లో నాని హోస్ట్ గా చేస్తున్నాడు. ఆదివారం మొదటి ఎపిసోడ్ మొదలైంది. ప్రారంభ ఎపిసోడ్ లో 16 మంది కంటెస్టంట్స్ ఇంట్రడక్షన్ వారిని హౌజ్ లోకి పంపించడమే జరిగింది. ఎన్.టి.ఆర్ అంత ఉత్సాహంగా నాని యాంకరింగ్ లేదని ఓపెన్ టాక్. 

అయితే మొదటిరోజే కాబట్టి అలా అనిపించి ఉండొచ్చు. ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో సెలబ్రిటీస్ గా వచ్చిన వారిలో కూడా ప్రేక్షకులకు తెలిసిన వారు తక్కువమందే. అంతేకాదు ఈసారి హౌజ్ లో కామన్ మెన్ కూడా ఉండేలా డిజైన్ చేశారు. ముగ్గురు కామన్ మెన్ బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చారు. మొదటి ఎపిసోడ్ అంచనాలను అందుకోలేదు. మరి ఈ వారం ఎలా సాగుతుందో చూడాలి.