
మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమ చేస్తున్నాడు. అరవింద సమేత టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రం నాచురల్ స్టార్ నానితో సినిమా చేస్తున్నాడని టాక్. జులాయి నుండి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లోనే సినిమా చేస్తున్న త్రివిక్రం బయట నిర్మాణ సంస్థలో సినిమా చేస్తున్నాడు.
సి.కళ్యాణ్ నిర్మాతగా త్రివిక్రం సినిమా ఉండబోతుందట. నానితో త్రివిక్రం సినిమా అంటే కచ్చితంగా సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా త్రివిక్రం క్రేజ్ కు మాత్రం నష్టం వాటిల్లలేదు. వరుస భారీ సినిమాలతో పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నాడు. మరి నానితో త్రివిక్రం సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.