సిల్లి ఫెలోస్ అల్లరి చేస్తారా..!

అల్లరి నరేష్, సునీల్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమాకు టైటిల్ గా సిల్లి ఫెల్లోస్ అని పెట్టారు. భీమనేని శ్రీనివాస్ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, సునీల్ కలిసి నటిస్తుండటం విశేషం. నరేష్ హీరోగా ఉన్నప్పుడు సునీల్ తన సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. ఇక సునీల్ హీరోగా టర్న్ తీసుకున్న తర్వాత ఇద్దరు కలిసి చేయలేదు.

ప్రస్తుతం కెరియర్ లో నరేష్, సునీల్ ఇద్దరు చాలా వెనుకపడి ఉన్నారు. మరి ఈసారైనా ఈ సినిమాతో ఇద్దరు హిట్ ట్రాక్ ఎక్కేస్తారేమో చూడాలి. రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ అయిన భీమనేని శ్రీనివాస్ ఈసారి స్ట్రైట్ సినిమా తీస్తుండటం విశేషం. మరి సిల్లీ ఫెల్లోస్ ఆడియెన్స్ ను మెప్పిస్తారా లేదా అన్నది చూడాలి. ఇండస్ట్రీకి కొత్త హీరోలు పరిచయమవుతున్న ఈ తరుణంలో అల్లరి నరేష్, సునీల్ ఇద్దరు చాలా వెనుకపడ్డారు. ఇప్పుడు వారిద్దరు కలిసి సత్తా చాటాల్సిన టైం వచ్చింది.