చెన్నైలో రజిని 'కాలా' రికార్డ్..!

సూపర్ స్టార్ రజినికాంత్, పా. రంజిత్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కాలా. కబాలి తర్వాత వచ్చిన ఈ కాంబినేషన్ లోని సినిమా అంచనాలను అందుకోలేకపోయినా పర్వాలేదు అనిపించుకుంది. కబాలి కన్నా బెటర్ అన్నట్టు చెబుతున్న ఈ సినిమా కోలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. తెలుగులో యావరేజ్ టాక్ తో ఓ మోస్తారు కలక్షన్స్ రాబట్టిన కాలా చెన్నై సిటీలో మొదటి రోజు కలక్షన్స్ 1.76 కోట్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ఇప్పటివరకు విజయ్ పేరు మీద మెర్సల్ 1.52 కోట్లతో చెన్నైలో మొదటి రోజు రికార్డ్ ఉంది. అది కాస్త కాలా తుడిచివేసింది. రజిని ఫ్యాన్స్ కు ఇది పండుగ లాంటి సినిమా. బ్లాక్ అండ్ బ్లాక్ లో రజిని తన లుక్, స్టైల్ తో ఫ్యాన్స్ ను అలరించాడు. ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో ఈశ్వరి రావు, హ్యూమా ఖురేషి నటించారు.