
2018 అనుకున్నట్టుగానే గ్రాండ్ గా బిగిన్ అయింది. సినిమాల పరంగా అయితే అంచనాలతో వచ్చినవి చతికిల పడితే అంచనాలకు మించి వసూళ్లు సాధించినవి కొన్ని సినిమాలు. ఈ ఇయర్ మొదటి సూపర్ హిట్ భాగమతి కాగా.. నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టింది రంగస్థలం. ఇక మహేష్ భరత్ అనే నేను కూడా హిట్ కొట్టాడు. మహానటి అయితే వసూళ్ల ప్రభంజనమే సృష్టించి బయోపిక్ సినిమాలకు కొత్త అర్ధం చెప్పింది.
ఇదిలా ఉంటే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ మాత్రం స్టార్ సినిమా అంటే అది యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఒక్కడిదే అని తెలుస్తుంది. త్రివిక్రం డైరక్షన్ లో రాబోతున్న అరవింద సమేత దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఈ సీజన్ లో ఎన్.టి.ఆర్ రెగ్యులర్ గా తన సినిమాలు రిలీజ్ చేస్తాడు. ఇక ఎన్.టి.ఆర్ కు పోటీగా స్టార్ సినిమాలేవి లేవు సెట్స్ మీద ఉన్న పెద్ద సినిమాలన్ని 2019లోనే వస్తాయి.
ఇక మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రమే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. దసరా బరిలో అయితే ఎన్.టి.ఆర్ కు పోటీగా నాని-నాగార్జున మల్టీస్టారర్, రాం హలో గురు ప్రేమ కోసమే, శర్వానంద్ పడి పడి లేచే మనసు, శ్రీను వైట్ల రవితేజ కాంబినేషన్ లో వచ్చే అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు వస్తున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏ సినిమాల్లో ఏది అసలైన దసరా ఉత్సవాన్ని జరుపుకునేలా చేస్తుందో చూడాలి.