
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కప్లీట్ చేసుకున్న ఈ సినిమా నేటి నుండి యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారట. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన సెట్స్ లో ఈ షూటింగ్ జరుగుతుంది.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆగష్టు 22న మెగాస్టర్ చిరంజీవి బర్త్ డే కానుకగా రిలీజ్ చేస్తున్నారట. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ గా రాబోతున్న సైరా ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని చిరు లుక్ లీక్ అవగా అఫిషియల్ లుక్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచేలా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.