
మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ తన భార్య ప్రణతితో విడిపోతున్న వార్తలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కెరియర్ లో సరైన హిట్ లేక సతమతమవుతున్న మంచు హీరో పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందుల్లో ఉన్నాడని ఆ వార్తల సారాంశం. కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఇద్దరికి సంధి కుదిర్చేలా ప్రయత్నించినా లాభం లేదని తెలుస్తుంది.
ఈ వార్తలు మనోజ్ దాకా వెళ్లడంతో వాటికి కరెక్ట్ పంచ్ వేసినట్టుగా తన భార్యతో దిగిన ఓ పిక్ ట్విట్టర్ లో పెట్టాడు. స్నేహితులతో పాటుగా భార్య ప్రణతితో మనోజ్ దిగిన పిక్ షేర్ చేశాడు మనోజ్. సో ఈ ఒక్క పిక్ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడని అంటున్నారు. ఈసారి ఓ ప్రయోగాత్మక సినిమా చేయాలని చూస్తున్న మంచు మనోజ్ కథల చర్చల్లోనే ఉన్నాడని తెలుస్తుంది.