బిగ్ బాస్-2లో ఆ న్యూస్ రీడర్..!

నాని హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ రాబోయే ఆదివారం నుండి ప్రసారం కాబోతుంది. సరికొత్త గేమ్ ప్లాన్ తో వస్తున్న ఈ రియాలిటీ షోలో ఇప్పటివరకు ఫైనల్ కంటెస్టంట్స్ లిస్ట్ రివీల్ చేయలేదు. రోజుకో లిస్ట్ బయటకు వస్తున్న సందర్భంలో ఏ లిస్ట్ ఫైనల్ అన్నది మాత్రం తెలియట్లేదు. ఇక లేటెస్ట్ గా టివి-9 యాంకర్ దీప్తి నల్లముత్తు బిగ్ బాస్ హౌజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.  

యాంకర్ గా తన టాలెంట్ చాటుతున్న దీప్తి బిగ్ బాస్ లో ఛాన్స్ పట్టేసిందని అంటున్నారు. ఇక దీప్తితో పాటుగా తేజశ్వి మడివాడ, సింగర్ గీతా మాధురి కూడా ఈ లిస్ట్ లో కన్ ఫాం అయ్యారు. సంచలనాల శ్రీరెడ్డి కూడా బిగ్ బాస్ లో ఉందన్న వార్తలు రాగా ఫైనల్ లిస్ట్ మాత్రం జూన్ 10నే తెలుస్తుంది. ఈసారి 100 రోజులు జరుగనున్న ఈ రియాల్టీ షో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.