సమంత మరో మహానటి అయ్యేదా..!

సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న సమంత స్టార్ హీరోయిన్ గా అందం, అభినయంతో అదరగొడుతుంది. ఈ ఇయర్ రంగస్థలం, మహానటి మాత్రమే కాదు తమిళ సినిమా అభిమన్యుడుతో కూడా హిట్ అందుకుంది సమంత. మూడు సినిమాలు ఆఫ్టర్ మ్యారేజ్ చేయడం సమంత క్రేజ్ ను మరింత పెంచాయి. పెళ్లైన హీరోయిన్స్ సినిమాలకు పనికిరారు అన్న సెంటిమెంట్ కూడా బ్రేక్ చేసింది సమంత.

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా గురించి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత. తన జీవితం కూడా సావిత్రిలా మారేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. నాగ చైతన్యతో ప్రేమ పెళ్లికి ముందు సిద్ధార్థ్ తో సమంత ప్రేమలో పడిందని తెలిసిందే. ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ తన జీవితం కూడా అలాంటి కష్టాలే పడాల్సి వచ్చేదని చెప్పింది. అంతేకాదు చైతుతో తన ప్రేమను చెప్పి అక్కినేని ఇంట కోడలిగా రావడం తన అదృష్టమని అన్నది సమంత.