
సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా పా. రంజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కాలా. కబాలి తర్వాత క్రేజీ మూవీగా వస్తున్న ఈ సినిమాకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. జూన్ 7న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఇప్పటికే కర్ణాటకలో రిలీజ్ కష్టమే అని తెలుస్తుండగా ఇప్పుడు ముంబైకి చెందిన ఓ జర్నలిస్ట్ ఈ కథ తన తండ్రి తిరవియం నాడార్ జీవిత ఆధారంగా తెరకెక్కించారని ఆరోపణలు చేస్తున్నాడు.
ముంబైలో అతిపెద్ద మురికివాడ అయిన ధారావి బ్యాక్ గ్రౌండ్ తో ఈ సినిమా వస్తుంది. ఈ ప్రాంతం నుండే మంచి నాయకుడిగా ఎదిగి రాష్ట్రాన్ని శాసించిన లీడర్ గా రజినికాంత్ నటిస్తున్నారు. అయితే ఈ కథ తన తండ్రి జీవితమే అంటూ జర్నలిస్ట్ జవహర్ నాడార్ ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు ఇందులో నాడార్ ను చట్ట వ్యతిరేక పనులను చేసే వాడిగా బ్యాడ్ గా చూపించారని ఆయన అంటున్నారు.
దీనికి కాలా టీం తనకు 100 కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలంటూ జవహర్ లీగల్ నోటీసులు పంపించాడు. ఈ ఆరోపణలకు చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.