ఏలేటితో నితిన్.. మైత్రి కాంబో అదుర్స్..!

శ్రీమంతుడుతో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ సినిమా సినిమాకు తమ రేంజ్ పెంచుకుంటూ పోతున్నారు. రీసెంట్ గా రంగస్థలంతో నాన్ బాహుబలి రికార్డ్ అందుకున్న ఈ నిర్మాతలు ప్రస్తుతం మరో క్రేజీ కాంబోని సెట్ చేశారని తెలుస్తుంది. క్రియేటివ్ డైరక్టర్ చంద్రశేఖర్ ఏలేటి డైరక్షన్ లో నితిన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు మైత్రి మేకర్స్.

అసలైతే ఈ సినిమాలో హీరోగా ముందు సాయి ధరం తేజ్ ను అనుకున్నారు కాని తేజు ఎందుకో ఆ సినిమా చేయట్లేదు. తేజు కాదనడంతో ఆ ప్రాజెక్ట్ నితిన్ దగ్గరకు వచ్చింది. ప్రస్తుతం నితిన్ శ్రీనివాస కళ్యాణం సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్నాడు. వరుస సక్సెస్ లతో ఫాంలో ఉన్న రాశి ఖన్న నితిన్ తో మొదటిసారి జోడి కడుతుంది.