నాగార్జున ఆఫీసర్.. ఇంత దారుణమా..!

శివతో సంచలనం సృష్టించిన కాంబినేషన్ కింగ్ నాగార్జున, ఆర్జివి.. పాతికేళ్ల తర్వాత ఆఫీసర్ తో కలిసి పనిచేశారు. ముందునుంది ఏదో తేడా కొడుతుందనిపించిన ఈ సినిమా మొదటి ఆటకే టాక్ తేడా కొట్టేసింది. ట్వీట్లు చేయడం కాదు సినిమా తీయడం నేర్చుకో అంటూ వర్మ మీద వచ్చిన కామెంట్స్ వింటూనే ఉన్నాం. నాగార్జున ఈ మూవీలో నటించడం ఓ బ్లండర్ మిస్టేక్ అని తేల్చేశారు.

ఈ సినిమా కలక్షన్స్ అయితే మరి దారుణంగా ఉండటం విశేషం. ఏపి-తెలంగాణా కలిపి నాగార్జున ఆఫీసర్ మూవీ కేవలం 45 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది అంటే ఇక ఆ సినిమా ఎంత దారుణంగా పోయిందో అర్ధం చేసుకోవచ్చు. నైజాం 9 లక్షలు.. సీడెడ్ 7 లక్షలు.. ఉత్తరాంధ్ర 6.5 లక్షలు.. గుంటూరు 4 లక్షలు.. ఈస్ట్ 4 లక్షలు.. వెస్ట్ 4 లక్షలు.. కృష్ణా 8 లక్షలు.. నెల్లూరు 2.5 లక్షలు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. నాగార్జున కెరియర్ లో ఇంత దారుణమైన సినిమా మరోటి లేదని చెప్పొచ్చు.