బిగ్ బాస్ కంటెస్టంట్ గా ఎన్.టి.ఆర్..!

అదేంటి చేస్తానంటే హోస్ట్ గా ఛాన్స్ ఉంది కదా మళ్లీ ఎన్.టి.ఆర్ ఎందుకు బిగ్ బాస్ హౌజ్ లో ఉండాలనుకుంటున్నాడు. అయినా ఆయనకు 100 రోజులు బిగ్ బాస్ హౌజ్ లో ఉండే తీరిక ఉందా.. ఒకవేళ వన్ డే గెస్ట్ గా వస్తారా.. ఇలా టైటిల్ చూసి ఇలాంటి ఆలోచనలు చాలానే వస్తాయి. అయితే బిగ్ బాస్ హౌజ్ లో ఎన్.టి.ఆర్ ఉండేది నిజమే కాని ఎన్.టి.ఆర్ అంటే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాదు.. నందమూరి తారకరత్న.  


నందమూరి హీరోగా ఒకేసారి 9 సినిమాల ముహుర్తాలతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ఎన్.టి.ఆర్ అదేనండి తారకరత్న.. హీరోగా నిలబడలేకపోయాడు. రీసెంట్ గా రెండు మూడు సినిమాల్లో విలన్ గా ప్రయత్నాలు చేసినా లాభం లేదు. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టంట్ గా హౌజ్ లో ఉండేందుకు డిసైడ్ అయ్యాడట. మొదటి సీజన్ లో నందమూరి హీరో ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా ఈ సీజన్ లో మరో నందమూరి హీరో బిగ్ బాస్ కంటెస్టంట్ గా ఉండటం విశేషం. మరి తారరత్న బిగ్ బాస్ హౌజ్ లో ఉంటున్నాడా లేడా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.