
రాజమౌళి డైరక్షన్ లో బాహుబలి తర్వాత మెగా నందమూరి మల్టీస్టారర్ గా ఓ క్రేజీ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా నిర్మాత డివివి దానయ్య. ఈమధ్యనే మహేష్ తో భరత్ అనే నేను సినిమా తీసి హిట్ అందుకున్నాడు. ఇక ఎన్.టి.ఆర్, రాం చరణ్ సినిమాకు సిద్ధం అవుతున్నాడు.
ఈ సినిమా విషయంలో 50 కోట్ల ఆఫర్ వద్దనేశాడట దానయ్య. 200 కోట్ల బడ్జెట్ తో రాజమౌళితో సినిమా ప్లాన్ చేస్తున్న దానయ్యకు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ నుండి 50 కోట్ల ఆఫర్ వచ్చిందట. సినిమా తనకు ఇచ్చేయమని దానయ్యకు ఆ ఆఫర్ ఇచ్చారట. అయితే దానయ్య మాత్రం దానికి ఒప్పుకోలేదట. 200 కోట్లు అటు ఇటైనా సరే రాజమౌళి సినిమా కాబట్టి 500 నుండి 600 కోట్ల దాకా బిజినెస్ అవుతుంది.
ఎలా లేదన్నా 200 కోట్ల దాకా లాభం వస్తుంది. ఖర్చులన్ని పోనూ 100 కోట్లు మిగిలడం ఖాయం. మరి అలాంటిది 50 కోట్లకు దానయ్య ఎలా సినిమా ఇచ్చేస్తాడు. ఇక్కడ కేవలం డబ్బు ఒక్కటే కాదు మెగా నందమూరి మల్టీస్టారర్ అది కూడా రాజమౌళి దర్శకత్వంలో సినిమాకు నిర్మాతగా ఎక్కువ క్రేజ్ తెస్తుందని దానయ్య భావిస్తున్నారు.