క్రిష్ కాపురంలో చిచ్చు పెట్టింది ఎవరు..!

ప్రముఖ దర్శకుడు క్రిష్ తన భార్య రమ్యతో విడిపోయేందుకు డైవర్స్ అప్లై చేశాడన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. గమ్యం సినిమా నుండి ప్రతి సినిమాతో తన ప్రతిభ చాటుకుంటున్న క్రిష్ 2016 ఆగష్టు 7న రమ్యను పెళ్లాడటం జరిగింది. దర్శకుడైన క్రిష్ డాక్టరైన రమ్యను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి జంట ఎంతో చూడముచ్చటగా ఉండేది.  

మరి ఏమైందో ఏమో కాని వృత్తిపరమైన డిస్టబెన్స్ వల్ల ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఇద్దరు డైవర్స్ కు అప్లై చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో మణికర్ణిక సినిమా చేస్తున్న క్రిష్ ఎన్.టి.ఆర్ బయోపిక్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక క్రిష్, రమ్య విడిపోడానికి టాలీవుడ్ హీరోయిన్ కూడా ఓ కారణమని అంటున్నారు. క్రిష్ సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన ఆ భామతో క్రిష్ డేటింగ్ లో ఉన్నాడని టాక్. ఇదే వార్త భార్యకు తెలియడంతో ఆమె అతనికి దూరమవ్వాలని అనుకున్నదట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నది తెలియాలి.