
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కతం వంశీ డైరక్షన్ లో వచ్చిన నా పేరు సూర్య అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా ఫలితంతో అసంతృప్తిగా ఉన్నరు. బన్ని యాంగ్రీ సోల్జర్ గా కనిపించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించింది. విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించగా లగడపాటి శ్రీధర్ ఈ సినిమాను నిర్మించారు.
ప్రీ రిలీజ్ బిజినెస్ 77 కోట్లతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు 50.14 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. చాలా చోట్ల ఈ సినిమాను ఎత్తేసి కొత్త సినిమాలు వేస్తున్నారు. దాదాపు సినిమా కలక్షన్స్ క్లోజింగ్ పొజిషన్ కు వచ్చాయట. సినిమా లెక్కలు చూస్తే దాదాపు 17 నుండి 20 కోట్ల నష్టాలు తెచ్చినట్టు తెలుస్తుంది. సూర్య దెబ్బ డిస్ట్రిబ్యూటర్స్ కు గట్టిగానే తగిలిందని చెప్పొచ్చు.
ఏరియాల వారిగా నా పేరు సూర్య కలక్షన్స్ :
నైజాం :12.60 కోట్లు
సీడెడ్ : 6.80 కోట్లు
ఉత్తరాంధ్ర : 5.30 కోట్లు
ఈస్ట్ : 3.70 కోట్లు
వెస్ట్ : 2.85 కోట్లు
కృష్ణా : 2.65 కోట్లు
గుంటూర్ : 3.90 కోట్లు
నెల్లూరు : 1.64 కోట్లు
ఏపి/టిఎస్ టోటల్ కలక్షన్స్ : 39.44 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 6.60 కోట్లు
ఓవర్సెస్ : 4.10 కోట్లు
వరల్డ్ వైడ్ కలక్షన్స్ : 50.14 కోట్లు.