
స్టార్ మా ప్రెస్టిజియస్ రియాలిటీ షో బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో 16 మంది కంటెస్టంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఇందులో లవర్ బోయ్ తరుణ్ పేరు కూడా ఉంది. నువ్వే కావాలి సినిమాతో ఇండస్ట్రీలో లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకున్న తరుణ్ ఆ తర్వాత వెనుకపడిపోయాడు. ఈమధ్యనే ఇది నా లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక బిగ్ బాస్ లో కంటెస్టంట్ గా తాను ఉన్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు తరుణ్. బిగ్ బాస్-2లో తాను లేనని ఓ ప్రకటన్ చేశాడు. తరుణ్ అఫిషియల్ గా చెప్పడంతో ప్రస్తుతం చెక్కర్లు కొడుతున్న బిగ్ బాస్-2 లిస్ట్ ఫేక్ అని తెలుస్తుంది. మరి తరుణ్ లానే మిగతా వారు కూడా బిగ్ బాస్ హౌజా అదేంటి అంటే మాత్రం అంతకు మించిన ట్విస్ట్ ఇంకోటి ఉండదు.