
ప్రస్తుతం ట్రెండింగ్ గా నడుస్తున్న హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ఛాలెంజ్ లో సెలబ్రిటీస్ అందరు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్ స్పొర్ట్స్, సిని సెలబ్రిటీస్ అందరి పాటిస్పేషన్ తో ముందుకెళ్తుంది. ఈమధ్యనే పి.వి. సింధు అఖిల్ ను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేయగా అఖిల్ నాగార్జున, నాగ చైతన్య, వరుణ్ థావన్ లను ఛాలెంజ్ చేశాడు.
ఇక ఇప్పుడు మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. తను వర్క్ అవుట్స్ చేస్తూ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కోలీవుడ్ సూర్య, హీరో పృధ్విలకు ఛాలెంజ్ విసిరాడు మోహన్ లాల్. మనం ఫిట్ గా ఉంటే ఇండియా కూడా ఫిట్ గా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో సెలబ్రిటీస్ అంతా ఈ ఛాలెంజ్ లో స్వతహాగా పాల్గొంటున్నారు.