
ఘట్టమనేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు ఇంకా ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకోలేదని చెప్పొచ్చు. రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తున్న సుధీర్ ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి డైరక్షన్ లో సమ్మోహనం సినిమా చేస్తున్నాడు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. సినిమాల మీద, హీరోయిన్స్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిన ఓ కుర్రాడు హీరోయిన్ ను ప్రేమిస్తే ఎలా ఉంటుందో అలాంటి కథతొనే ఈ సమ్మోహనం సినిమా రాబోతుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సమ్మోహనం ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. త్వరలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా సుధీర్ బాబుకి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.