
అదేంటి మహేష్ నటించిన భరత్ అనే నేను ఆల్రెడీ ఏప్రిల్ 20న రిలీజ్ అయ్యింది కదా.. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మహేష్ కు భారీ హిట్ నమోదు చేసింది కదా మరి మళ్లీ ఈ సినిమా రిలీజ్ ఏంటని అనుకోవచ్చు. మే 31న భరత్ తమిళ వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది. మరి జూన్ 9న మహేష్ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది అంటే ఇంకెక్కడ ఆన్ లైన్ లో అని తెలుస్తుంది.
ఒకప్పుడు స్టార్ సినిమా బుల్లితెర మీదకు రావాలంటే కనీసం ఏడాది గడవాల్సిందే. ఊళ్ల్లో టూరింగ్ టాకీసుకే నెలల తర్వాత వస్తుంది. కాని ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి నెల తిరగకముందే ఆన్ లైన్ లోకి వచ్చేస్తుంది. అమేజాన్ ప్రైమ్ ఆ విషయంలో ఫుల్ స్పీడ్ మీద ఉంది. ఈమధ్యనే రంగస్థలం సినిమాను ప్రైం వీడియోస్ లో రిలీజ్ చేసిన అమేజాన్ నిర్వాహకులు. ఇప్పుడు మహేష్ భరత్ అనే నేను సినిమాను జూన్ 9న ఆన్ లైన్ లోకి వదులుతున్నారు.
అమేజాన్ ప్రైం మెంబర్షిప్ ఉన్న వారంతా ఇంట్లోనే భరత్ అనే నేను ఫుల్ వర్షన్ మూవీ చేసేయొచ్చు. అన్నట్టు సినిమాలో కొన్ని కట్ చేసిన సీన్స్ కూడా అమేజాన్ ప్రైం లో ఉంచబడుతుంది. మొత్తానికి జూన్ 9న అమేజాన్ ప్రైం లో మహేష్ భరత్ అనే నేను మరోసారి గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.