
స్టార్ మా ప్రతిష్టాత్మకంగా ప్రెజెంట్ చేస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు సెకండ్ సీజన్ కు సిద్ధమైంది. బిగ్ బాస్ సీజన్ వన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా.. ఇప్పుడు ఈ సెకండ్ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేస్తున్నాడు. ఈమధ్యనే టీజర్ ద్వారా ప్రేక్షకులను అలరించిన నాని ఇప్పుడు ఈ షో ఎప్పుడు వస్తుందన్న విషయాన్ని రివీల్ చేశాడు. జూన్ 10 నుండి బిగ్ బాస్ సీజన్ 2 మొదలవనుందట.
100 రోజుల ఈ షోలో 16 మంది క్రేజీ సెలబ్రిటీస్ పాటిస్పేట్ చేస్తారట. ఒకే ఇంట్లో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 100 రోజులు ఎవరుంటారు. ఇక ఈ సీజన్ లో మరింత మసాలా ఉంటుందని చెప్పిన నాని ఏదైనా జరగొచ్చని చెబుతున్నాడు. కంటెస్టంట్స్ లిస్ట్ కూడా త్వరలో అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారని అంటున్నారు. మరి ఈ సీజన్ బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.