మహేష్ 'రాజసం' చూపిస్తాడా..!

భరత్ అనే నేను హిట్ తో కాస్త రిలాక్స్ అయిన మహేష్ తన తర్వాత సినిమా పనులను మొదలుపెట్టనున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహేష్ 25వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని అశ్వనిదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత మహేష్ మాస్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. అంతేకాదు సినిమా కథ కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందట.

ఈ సినిమాకు టైటిల్ గా రాజసం అని పెట్టే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. రాజసం ఉట్టిపడేలా ఉండే రాజకుమార్డు మహేష్ అలాంటి మహేష్ కు ఈ టైటిల్ అయితే మారు మాట్లాడకుండా ఓకే అనేయొచ్చు. ఇక ఈ టైటిల్ అలా లీక్ అయ్యిందో లేదో మహేష్ ఫ్యాన్స్ ఓ క్రేజీ పోస్టర్ కూడా డిజైన్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ రాజసం పోస్టర్ సంచలనంగా మారింది.