
కింగ్ నాగార్జున, సెన్సేషన్ల్ డైరక్టర్ రాం గోపాల్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ఆఫీసర్. శివతో సంచలనం సృష్టించిన ఈ కాంబినేషన్ లో పాతికేళ్ల తర్వాత కలిసి చేస్తున్న సినిమా ఇది అందుకే అక్కినేని ఫ్యాన్స్ లోనే కాదు సిని ప్రియులలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఈరోజు పూర్తి చేసుకుంది.
పవర్ పోలీస్ గా నాగార్జున అదిరిపోయేలా చేశారట. వర్మ టేకింగ్ కూడా అదుర్స్ అనేలా ఉందట. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నాగార్జున తాను చాలా రోజుల తర్వాత కంప్లీట్ యాక్షన్ ఇంటెన్స్ ఉన్న మూవీ చేశాననని ఆఫీసర్ గురించి చెప్పారు. చెప్పినట్టుగానే నాగ్ పర్ఫార్మెన్స్ బాగుందట. సెన్సార్ నుండి ఆఫీసర్ సినిమాకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అంతేకాదు సినిమాకు సెన్సార్ వాళ్లు యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. మైరా సరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.