తెరమీదకు కాంతారావు బయోపిక్..!

బయోపిక్ సినిమాల క్రేజ్ కొనసాగుతున్న ఈ తరుణంలో మహానటి సినిమా మంచి విజయాన్ని అందుకోగా ఆ కోవలోనే మరిన్ని బయోపిక్ సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఎన్.టి.ఆర్ బయోపిక్ గా ఎన్.టి.ఆర్, వైఎస్సార్ బయోపిక్ గా యాత్ర సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో బయోపిక్ సినిమా సిద్ధమవుతుంది. 


సిని నటుడు టిఎల్ కాంతారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రాబోతుంది. దాదాసాహేబ్ పాల్కే అవార్డుతో పాటుగా నంది అవార్డులను అందుకున్న డాక్టర్ పీసీ ఆదిత్య కాంతారావు బయోపిక్ డైరెక్ట్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్, ఏయన్నార్ లతో సమానంగా వెడితెర మీద గొప్ప నటుడిగా అభిమానుల నీరాజనాలు అందుకున్న నటుడు కాంతారావు. ఈ బయోపిక్ సినిమా తీసేందుకు కాంతారావు స్వగ్రామం అయిన కోదాడ మండలం గుదిబండ గ్రామానికి పీసీ ఆదిత్య ఆదివారం వచ్చారు.

అక్కడ కాంతారావు గురించి తెలిసిన వారు.. ఆయన్ను కలిసి వారి దగ్గర నుండి తన సినిమాకు కావాల్సిన విషయాలను సేకరిస్తున్నారు. కాంతారావు జీవితాని రెండు కోణాల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. 'అనగనగా ఓ రాకుమారుడు' అనే టైటిల్ తో ఈ సినిమా వస్తుంది. 1950 నుండి 1971 వరకు స్వర్ణయుగంగా గడుపగా ఆ తర్వాత కష్టాలపాలయ్యారు కాంతారావు. కాంతారావు చివరి ఘట్టాలను ఆయన కష్టాలను రెండు గంటల్లో చెబుతారట దర్శకుడు ఆదిత్య.