ఇండియన్-2 పై కమల్ గురి..!

కమల్ హాసన్, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలుసు. ఆ సినిమా సీక్వల్ గా సినిమా తీయాలని ఎన్నాళ్ల నుండో అనుకుంటున్నా అది కుదరడం లేదు. రోబో 2.ఓ సినిమా పూర్తయ్యాక దాని గురించి ఆలోచిద్దాం అనుకుంటే అది తెగట్లేదు ముడి పడట్లేదు. ఈమధ్యనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కమల్ మక్కల్ నీది మయిమ్ పార్టీని స్థాపించారు. 

ఈమధ్యనే రాజకీయ యాత్రను సాగిస్తున్న కమల్ ఇండియ-2 కథ మీద గురి పెట్టాడట. దేశంలో జరుగుతున్న అవినీతి మీద ఈసారి గట్టి పంచ్ వేయాలని చూస్తున్నారట. అంతేకాదు ఇండియం-2 లో సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చేలా కథ సిద్ధం చేయమన్నట్టు తెలుస్తుంది. కమల్ చెప్పిన ఇంపుట్స్ అన్ని తీసుకుని శంకర్ కాస్త టైం అడిగినట్టు చెబుతున్నారు.