మామా అల్లుళ్ల కథ..!

విక్టరీ వెంకటేష్, నాగ చైతయ కలిసి ఓ క్రేజీ మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాబి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా కథ ప్రముఖ రచయిత జనార్థన మహర్షి అందించినట్టు తెలుస్తుంది. తన దగ్గర ఉన్న లైన్ వెంకటేష్ తో ప్రస్థావించగా చైతుతో మల్టీస్టారర్ కు పర్ఫెక్ట్ కథ అని డిసైడ్ అయ్యారట. ఇక ఈ సినిమాను పవర్ డైరక్టర్ బాబి డైరెక్ట్ చేస్తున్నాడని తెలిసిందే.

ఇందులో ఈ రియల్ మేనమా, మేనళ్లుడులు మామా, అల్లుళ్లుగా నటిస్తున్నారట. పల్లెటూరి నేపథ్యంలో వచ్చే ఈ కథ ప్రతి ఒక్కరిని కదిలిస్తుదని అంటున్నారు. దగ్గుబాటి, అక్కినేని హీరోలు కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం వెంకటేష్ వరుణ్ తేజ్ తో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా చేస్తున్నాడు. చైతు సవ్యసాచి ఫినిష్ చేసి మారుతి డైరక్షన్ లో శైలజా రెడ్డి అల్లుడు సినిమా షూటింగ్ లో ఉన్నాడు. మరి ఈ మామా అల్లుళ్ల కథ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.