
రంగస్థలం హిట్ తో ఏకంగా బ్లాక్ బస్టర్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్ తన తర్వాత సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి చేస్తున్నాడు. చిట్టిబాబు సినిమాకు కాసుల వర్షం కురిపించేలా చేసిన సుక్కు ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద ఇప్పటికే డైరక్షన్ టీం వర్క్ స్టార్ట్ చేసిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సుకుమార్ డిమాండ్ ఎంతంటే అక్షరాల 18 కోట్లట.
నిన్న మొన్నటిదాకా 10కి అటు ఇటుగా ఉన్న సుకుమార్ రంగస్థలం ఒక్క దెబ్బతో 18 కోట్లకు వచ్చేశాడు. రాజమౌళి ఇప్పటికే 20 కోట్ల దాకా పారితోషికం కింద అందుకుంటున్నాడని టాక్. కొరటాల శివ కూడా దాదాపు ఆ రేంజ్ కు వెళ్లాడట. ఇక త్రివిక్రం కూడా అటు ఇటుగా బాగానే లాగుతున్నట్టు తెలుస్తుంది. వారి దారిలోనే సుకుమార్ కూడా 18 కోట్ల రెమ్యునరేషన్ అది చాలదు అన్నట్టు లాభాల్లో వాటా కూడా అంటున్నాడట. రంగస్థలంతో సుకుమార్ రేంజ్ ఏంటన్నది ఈ రెమ్యునరేషన్ చూస్తే తెలుస్తుంది.