
టాలీవుడ్ స్టార్స్ కు ఓవర్సీస్ రేంజ్ సినిమా సినిమాకు పెరుగుతూ వస్తుంది. యూఎస్ లో మహేష్ రేంజ్ ను అందుకోవాలని అందరు స్టార్స్ ప్రయత్నిస్తున్నారు. అక్కడ మిలియన్ డాలర్ వసూళ్లను మొదలుపెట్టిన మహేష్ అదే ఫాంను కొనసాగిస్తున్నాడు. ఇక ఈమధ్య వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా తన సినిమాలతో ఓవర్సీస్ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు.
ఇన్నాళ్లు 10 కోట్ల లోపే అక్కడ బిజినెస్ చేసే ఎన్.టి.ఆర్ రాబోతున్న త్రివిక్రం సినిమా అరవింద సమేతకు ఫ్యాన్సీ ఆఫర్ అందుకున్నాడట. ఏకంగా 11 కోట్లతో ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్నారట. ఎన్.టి.ఆర్ రేంజ్ కు ఇది పర్ఫెక్ట్ ఫిగర్ అని చెప్పొచ్చు. ఈమధ్య తెలుగు సినిమా బాక్సాఫీస్ కలక్షన్స్ లో యూఎస్ వసూళ్లు కూడా ముఖ్య పాత్ర పోశిస్తున్నాయి. మరి ఎన్.టి.ఆర్ అరవింద సమేత 11 కోట్లకు కొన్న వారు ఆ సినిమాతో అక్కడ ఎంత లాభాలను పొందుతారో చూడాలి.
ఈమధ్యనే రిలీజ్ అయిన అరవింద సమేత ఫస్ట్ లుక్ అదిరిపోయింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ లో మ్యూజిక్ అదిరిప్ళోయింది. పూజా హెగ్దె ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.