
భరత్ అనే నేను హిట్ తో బిగ్ రిలీఫ్ పొందిన మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీ ట్రిప్ లో జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక మహేష్ చేయబోయే 25వ సినిమా చాలా ప్రెస్టిజియస్ గా తీసుకున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజుతో పాటుగా అశ్వనిదత్ నిర్మాణ బాగస్వామ్యం అవుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాలో పూజా హెగ్దె ఫీమేల్ లీడ్ గా ఫైనల్ అయ్యింది.
ఇక ఈ సినిమాలో మహేష్ న్యూ లుక్ లో కనిపిస్తాడట. ఈమధ్య మహేష్ సినిమాల కథలు కొత్తగా ఉంటున్నా తన లుక్ మాత్రం అన్నిటిలో దాదాపు ఒకేవిధంగా ఉంది. అందుకే వంశీ పైడిపల్లి సినిమాలో లుక్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడట మహేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న మహేష్ 25వ సినిమా ఓపెనింగ్ డేట్ అఫిషియల్ గా తెలియాల్సి ఉంది.