
లవర్ బోయ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా కెరియర్ సంక్షోభంలో పడటం ఆ తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోవడం అందరికి తెలిసిందే. ఉదయ్ కిరణ్ మరణం సిని పరిశ్రమను షాక్ కు గురి చేసింది. అయితే ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఉదయ్ కిరణ్ వార్తల్లో నిలిచాడు. ప్రముఖ దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
నేనే రాజు నేనే మంత్రి తర్వాత మళ్లీ ఫాం లోకి వచ్చిన తేజ బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ సినిమా నుండి బయటకు వచ్చాడు. ప్రస్తుతం తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. చిత్రం సినిమాతో తాను దర్శకుడిగా ఉదయ్ కిరణ్ హీరోగా ఒకేసారి కెరియర్ ప్రారంభించారు ఉదయ్ కిరణ్ కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో చిరంజీవి కూతురితో వివాహం చేయదలచారు. ఎంగేజ్మెంట్ దాకా వెళ్లిన ఆ పెళ్లి ఆగిపోయింది. మరి ఉదయ్ బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో తేజ ఏయే అంశాలను ప్రస్తావిస్తాడు. ఎవరెవరిని టార్గెట్ చేస్తాడు అన్నది తెలియాల్సి ఉంది.