
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా నేల టిక్కెట్టు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన కళ్యాణ్ కృష్ణ రవితేజతో చేసిన సినిమా హ్యాట్రిక్ ఇస్తుందని అంటున్నారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. మాస్ రాజా ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలతో పాటుగా సినిమాలో కంటెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
రాజా ది గ్రేట్ తర్వాత టచ్ చేసి చూడు సినిమా ఫ్లాప్ అవగా మళ్లీ ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు రవితేజ. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తుంది. ఈ నెల 25న రిలీజ్ అవనున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చుట్టూ జనం మధ్యఓ మనం.. ముసలితనం అంటే చేతకాని తనం కాదురా నిలువెత్తు అనుభవం అంటూ కళ్యాణ్ కృష్ణ రాసిన డైలాగ్స్ ట్రైలర్ రేంజ్ ను పెంచాయి. మరి సినిమా మాస్ రాజాకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.