త్రిషా పెళ్లికి రెడీ..!

సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న త్రిష కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకునేందుకు ఎంగేజ్మెంట్ దాకా వెళ్లినా మళ్లీ ఎందుకో అది క్యాన్సిల్ చేసుకుని సినిమాల మీద ఫోకస్ పెట్టింది. కెరియర్ లో సినిమాలు చేస్తున్నా ఇదవరకున్నంత క్రేజ్ దక్కించుకోని ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ పెళ్లికి సిద్ధమైందని తెలుస్తుంది. తెలుగులో మార్కెట్ అసలు ఏమాత్రం లేని త్రిషా తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తుంది.

అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలవడంతో అంతగా ప్రాధాన్యత పొందట్లేదు. స్టార్ హీరోల్లో నటించే అవకాశాలు ఎలాగు రావట్లేదు అందుకే ఇక కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లికి సిద్ధమయ్యిందని అంటున్నారు. ఆల్రెడీ ఆ పనుల్లోనే ఉన్నదని తెలుస్తుంది. ఈమధ్యనే శ్రీయ సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుంది ఆ దారిలోనే ఓ ఫారినర్ తో త్రిష పెళ్లికి రెడీ అయ్యిందని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం పెళ్లి షాపింగ్ కోసమే విదేశాలకు వెళ్లిందట. పెళ్లి గురించి అడిగితే ఇప్పుడు అప్పుడు అంటూ మాటదాటేసే త్రిషా ఫైనల్ గా పెళ్లి చేసుకున్నాకే ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.