త్రివిక్రం 'అ' సెటిమెంట్.. 20న తేలిపోద్ది..!

తన మాటల తూటాలతో తెలుగు ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న రచయిత, దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ అజ్ఞాతవాసి ఫ్లాప్ తో తన మీద అపవాదాలు మూటకట్టుకున్నాడు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తున్న త్రివిక్రం ఆ సినిమాకు టైటిల్ గా 'అసామాన్యుడు' అని పెట్టబోతున్నారట. సినిమా టైటిల్ పై నందమూరి ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.  


అజ్ఞాతవాసి టైటిల్ లో 'అ' ఉండటంతో ఈ 'అ' సెంటిమెంట్ త్రివిక్రం కు కలిసి రాలేదని తమ హీరోకి ఇది కలిసిరాదని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ హడావిడి చిత్రయూనిట్ కు తెలియడంతో సినిమా టైటిల్ అసామాన్యుడు కాదని వేరే అనుకుంటున్నారని లీక్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, శ్రద్ధ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు అసలు టైటిల్ ఈ నెల 20న ఎనౌన్స్ చేయబోతున్నారట. ఆరోజు ఎన్.టి.ఆర్ బర్త్ డే కాబట్టి దాదాపుగా సినిమా టైటిల్ పై ఆరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.